Heavy Rains in Telangana

Heavy Rain Lashes Hyderabad: భాగ్యనగరంలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, మియాపూర్, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో గంటకు పైగా నిరంతరాయంగా వర్షం పడింది. షేక్‌పేట్‌లో రోడ్లపై భారీగా నీరు చేరగా, ఫిల్మ్‌నగర్ రోడ్డుపై ఇసుక, రాళ్లు కొట్టుకురావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వర్షపాతం వివరాల ప్రకారం చందానగర్, రామచంద్రపురం ప్రాంతాల్లో అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. లింగంపల్లిలో 12 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 10 సెంటీమీటర్లు వర్షం కురిసింది. అలాగే పటాన్‌చెరులో 7.6 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం కూడా రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

ఇక వాట్సాప్‌లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *