Telangana Heatwave

Telangana Heatwave: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వేడి, ఉక్కబోత ఎక్కువవడంతో డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దాహం వేయకముందే తరచూ నీరు తాగాలని, ఓఆర్ఎస్, కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ, మద్యం, షుగర్ డ్రింక్స్ తగ్గించాలని చెబుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని, తప్పనిసరిగా బయటకు వెళ్తే లేత రంగు కాటన్ దుస్తులు, టోపీ, గొడుగు వంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇంట్లో చల్లని వాతావరణంలో ఉండడం, చల్లటి నీటితో స్నానం చేయడం కూడా ఉపశమనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..

SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.

External Links:

వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *