Akhanda 2 Enters The Sankranti Race

Akhanda 2 Enters The Sankranti Race: నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘అఖండ–2’. రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్, డబ్బింగ్ పనులు పూర్తయ్యాక ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తామని ముందే ప్రకటించినప్పటికీ, ఆ తేదీకి అఖండ 2 రాకపోవచ్చనే వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. విడుదలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నా ప్రమోషన్లు ప్రారంభించకపోవడం కూడా ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తోంది. సంక్రాంతి రేసులో సినిమా విడుదల చేయాలన్న ఆలోచన మేకర్స్‌లో ఉన్నట్టు సమాచారం. జనవరి 9న రావాల్సిన ‘రాజాసాబ్’ ఇంకా వర్క్ పూర్తికాకపోవడంతో అది వాయిదా పడితే, అదే తేదీని అఖండ 2 కోసం తీసుకునే అవకాశముందని టాక్. అలాంటిదే జరిగితే దసరా తర్వాత సంక్రాంతికి మరోసారి బాలయ్య vs చిరు పోటీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

సంక్రాంతి రేస్ లోకి అఖండ 2.. రాజాసాబ్ వాయిదా పడుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *