Bharathiraja passes away

Bharathiraja passes away: ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా బుధవారం (జూన్ 10) కన్నుమూశారు. 85 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గ్రామీణ కథలను, పల్లె అందాలను వెండితెరపై అద్భుతంగా చూపించి భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

భారతీరాజా కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ వద్ద సహాయకుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తమిళంలో ‘16 వయదినిలే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగులో ‘సీతాకోకచిలుక’, ‘కొత్త జీవితాలు’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో పాటు ఆయనకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో నటించారు. తన సినీ జీవితంలో 6 జాతీయ అవార్డులు, పద్మశ్రీతో పాటు అనేక గౌరవాలు అందుకున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *