First Single Raradheevara Release: జోవియల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌కు స్వామిరారా, కార్తీకేయ సినిమాలు పెద్ద మలుపు అయ్యాయి. ఆ తర్వాత స్క్రిప్ట్ ఎంపికలో జాగ్రత్తగా మారి మంచి విజయాలు సాధించాడు. కార్తీకేయ 2తో పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించిన నిఖిల్, తర్వాత కొన్ని తప్పిదాల వల్ల కెరీర్ గ్రాఫ్ కొంత తగ్గింది. 18 పేజెస్ ఓకే అనిపించుకోగా, స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు మళ్లీ బలమైన కంబ్యాక్ కోసం పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సినిమాకోసం నిఖిల్ పూర్తిగా లుక్ మార్చుకుని, వారియర్ పాత్ర కోసం 45 రోజుల ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రవిబస్రూర్, సెంథిల్ కుమార్ వంటి ప్రముఖ టెక్నీషియన్స్ పని చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదట ఫిబ్రవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నా, VFX కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ సమ్మర్‌లో రిలీజ్ అయితే మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా