Kerala Story 2 OTT: ‘ది కేరళ స్టోరీ’ విజయానికి కొనసాగింపుగా వచ్చిన ‘ది కేరళ స్టోరీ 2’ థియేటర్లలో ఫిబ్రవరి 27న విడుదలై చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. మొదట మే 8న విడుదల చేస్తామని చెప్పినా, వారం ముందుగానే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) ఈ సినిమా హక్కులను పొందింది. తాజా సమాచారం ప్రకారం మే 1, 2026 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
ఈ సినిమా ముగ్గురు అమ్మాయిల కథల చుట్టూ సాగుతుంది. సురేఖ (ఉల్కా గుప్త) యూపీఎస్సీ కోసం సిద్ధమవుతూ జర్నలిస్ట్ సలీమ్‌తో ప్రేమలో పడుతుంది. దివ్య (అదితి భాటియా) సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కావాలని ఆశపడుతూ రషీద్ మాయలో పడుతుంది. నేహా (ఐశ్వర్య ఓజా) క్రీడాకారిణి కావాలని కోరుకుంటూ ఫైజన్‌తో వెళ్లిపోతుంది. తల్లిదండ్రుల మాటలు వినకుండా వెళ్లిన ఈ ముగ్గురు అమ్మాయిలకు ఎదురైన మోసాలు, సమస్యలు మరియు చివరకు వారు తీసుకున్న నిర్ణయం ఈ సినిమాలో చూపించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..