Nidhhi agerwal

Nidhhi agerwal: టాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్లపై వివాదం కొనసాగుతోంది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా నటి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 21 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది.

నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేస్తోంది. సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రైల్స్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ, త్వరలో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు..ఈడీ విచారణకు నిధి అగర్వాల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *