Pandu Master Seriously Injured

Pandu Master Seriously Injured: విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం తగరపువలస సమీపంలోని ఓ జాతరలో డ్యాన్స్ కార్యక్రమానికి హాజరైన పండు, ఈవెంట్ ముగిసిన తర్వాత తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు.

ఆనందపురం వద్ద కారులో ఉన్న ఓ డ్యాన్సర్‌కు అస్వస్థత రావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌తో పాటు కారులో ఉన్న మరికొందరు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 7,000 కోట్ల మైఖేల్ జాక్సన్ బయోపిక్ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *