Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: అస్సాంలో నేడు హిమంత బిస్వా శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఉదయం 11.40 గంటలకు ఆయనతో పాటు నలుగురు మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. వీరిలో బీజేపీ, ఏజీపీ, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. హిమంత బిస్వా శర్మ వరుసగా రెండోసారి సీఎం అయిన తొలి కాంగ్రెసేతర నేతగా రికార్డు సృష్టించనున్నారు. మంత్రులుగా రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ వంటి నేతలు బాధ్యతలు తీసుకోనున్నారు.

ఖానాపారా వెటర్నరీ కాలేజ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఇటీవల ఎన్నికల్లో 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సాధించింది. బీజేపీ 82 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో అస్సాంలో ఎన్డీఏ తన బలాన్ని మరింతగా స్థిరపరుచుకుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *