Vande Mataram Vs Tamil Anthem: తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ముందుగా ‘వందేమాతరం’, తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’, చివరగా తమిళ రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్’ వినిపించడంతో డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. సాధారణంగా తమిళనాడులో ముందుగా తమిళ గీతం, చివరగా జాతీయ గీతం పాడటం ఆనవాయితీ అని డీఎంకే తెలిపింది. తమిళ గీతానికి సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించింది.
ఈ కార్యక్రమం చెన్నై రాజ్‌భవన్‌లో జరగడంతో పాటల క్రమాన్ని గవర్నర్ కార్యాలయమే నిర్ణయించిందని టీవీకే వివరణ ఇచ్చింది. కానీ డీఎంకే ఈ సమాధానంతో అసంతృప్తిగా ఉంది. టీవీకే బీజేపీకి దగ్గరవుతోందని విమర్శించింది. డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ తమిళ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశారని అన్నారు. అలాగే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు కూడా తమిళ గీతానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?