Ap Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు భవనాల పరిసరాల్లో రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పీ ప్రక్రియ, సీఆర్డీఏకు ప్రత్యేక అగ్నిమాపక విభాగం ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరగనుంది. అలాగే పర్యాటకాభివృద్ధి కోసం జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణం, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ అభివృద్ధి, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌కు కొత్త టెండర్లు పిలవడం వంటి ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
అదే విధంగా ఎల్పీఎస్ లేఅవుట్లలో ఏటీఎంలు, కియోస్క్‌ల ఏర్పాటుకు అనుమతి, 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు, అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠంలో భూమి కేటాయింపు అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దిగువ, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల విడుదల, ప్రభుత్వ-ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపులు కూడా కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి. సమావేశం అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, వైఎస్సార్‌సీపీ విమర్శలు మరియు ప్రచారాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ