Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న రోజున పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. తెలంగాణపై ఆయనకు ఉన్న వ్యతిరేక భావన ఆయన మాటల్లో కనిపించిందని విమర్శించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన భాష రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను అవమానించినట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన కోసం తాము చేసిన పోరాటాలను కూడా ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ అస్థిత్వం, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించబోమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడాన్ని ఎవరూ అడ్డుకోరని, కానీ తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే కొత్త చట్టాలు తీసుకురావడానికైనా ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ వివాదాలు సృష్టించడం మానేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *