CM Chandrababu: 11996లో వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసిన తాను, 30 ఏళ్ల తర్వాత 2026లో మొదటి దశను ప్రారంభించడం ఎంతో భావోద్వేగ క్షణమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.7,983 కోట్లతో పూర్తైన మొదటి దశ ద్వారా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీరు చేరుతుందని తెలిపారు. ఈ దశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని సీఎం పేర్కొన్నారు. వెలిగొండ రెండో దశను 2028 నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..