Cm Revanth Reddy Slams Centre: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారమై, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శించారు. “ఆత్మనిర్భర్” అనే నినాదం కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగపడిందని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోయాయని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదని పేర్కొన్నారు.
గత పదేళ్లుగా రూపాయి విలువ పడిపోతూనే ఉందని, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని కారణంగా చూపించి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ప్రజలకు భారంగా మారిందన్నారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే రూ.3కిపైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసం మోదీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందనే భావన ప్రజల్లో ఏర్పడిందని అన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు