Pawan Kalyan Directs Jana Sena: జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో అమలు చేయడం చాలా ముఖ్యమని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం రాత్రి విజయవాడలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరగా పరిష్కరించేలా పని చేయాలని సూచించారు. ప్రజలు పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయడంతో పాటు, ప్రజలు మరియు పార్టీ శ్రేణులతో మరింత దగ్గరగా ఉండాలని చెప్పారు.
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి వీర మహిళ, జనసైనికుడికి అండగా నిలవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వారి సమస్యలు తెలుసుకుని అవసరమైన సహాయం అందించాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే ప్రజల, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు తమ అనుభవాలను పంచుకోగా, వారికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం