Delhi Gang Rape: ఢిల్లీలో ఓ కదులుతున్న స్లీపర్ బస్సులో 30 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధిత మహిళ ఫ్యాక్టరీ పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బస్ స్టాండ్ దగ్గర సమయం అడిగిన మహిళను బస్సు వద్ద ఉన్న వ్యక్తి బలవంతంగా లోపలికి లాగి, బస్సులో ఉన్న ఇద్దరు ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత నాంగ్లోయి మెట్రో స్టేషన్ దగ్గర మహిళను దించేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్యాంగ్‌రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు బీహార్ రిజిస్ట్రేషన్ ఉన్న స్లీపర్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్సు డ్రైవర్ ఉమేష్, కండక్టర్ రమేంద్రను అరెస్ట్ చేసి న్యాయస్థాన కస్టడీకి పంపించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
భార్య చేతిలో మరో భర్త బలి.. ప్రియుడుతో కలిసి..!