Health Scheme Draft

Health Scheme Draft: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల కోసం నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. IFMIS ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి, ప్రభుత్వ, ఎంపానెల్డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో OP, IP చికిత్సలు, పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందులు, అత్యవసర సేవలను పూర్తిగా క్యాష్‌లెస్‌గా అందించనుంది. ప్రస్తుతం ఉన్న 12 వెల్‌నెస్ సెంటర్లకు అదనంగా మరో 25 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

ఈ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందిస్తారు. అంతకంటే ఎక్కువ ఖర్చును EHCT ఆమోదిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ ప్రాథమిక వేతనం లేదా పెన్షన్‌లో 1.5% చందా చెల్లించగా, ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని జమ చేస్తుంది. ప్రత్యేక ట్రస్ట్ ఫండ్, మొబైల్ యాప్, ఆన్‌లైన్ క్లెయిమ్ వ్యవస్థలతో పథకాన్ని పారదర్శకంగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఇవి ముసాయిదా మార్గదర్శకాలే. ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చిన తర్వాత అమల్లోకి వస్తాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *