AP Assembly Sessions

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం పలు కీలక బిల్లులు, వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి. మెగా డీఎస్సీ-2025పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేయనుండగా, విద్యుత్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులపై కూడా చర్చ జరగనుంది. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం, సాగునీరు, తాగునీటిపై ఎదురయ్యే సమస్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. సమావేశాల షెడ్యూల్‌పై బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలుస్తారు. ఆ తర్వాత విజయవాడలో జరిగే వివాహ రిసెప్షన్‌కు హాజరై రాత్రి 8 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *