Cheyutha Pension: తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తు గడువును మరో రోజు పొడిగించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులు రేపు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వరుసగా మూడు రోజులు ప్రభుత్వ సెలవులు రావడంతో పలువురు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
లబ్ధిదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దరఖాస్తు గడువును మరో రోజు పొడిగించింది. ఈ విషయాన్ని SERP సీఈవో దివ్య దేవరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు