Trump Comments On India

Trump Comments On India: భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల అభ్యర్థనతోనే తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నామని చెప్పారు. అయితే ఈ నిర్ణయం తనకు పూర్తిగా నచ్చలేదని, కానీ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలుమార్లు కోరడంతో సీజ్‌ఫైర్‌పై చర్చించినట్లు తెలిపారు. ట్రంప్ పాక్ నాయకులను ప్రశంసిస్తూ మాట్లాడటం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భారత్ ఒత్తిడి వల్లే పాకిస్థాన్ అమెరికా సహాయం కోరినట్లు ఈ వ్యాఖ్యలతో స్పష్టమైందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాత్రం భారత్ అమెరికా ద్వారా మధ్యవర్తిత్వం కోరిందని చెప్పాడు. కానీ అమెరికా అధికారిక రికార్డులు మాత్రం వేరే విషయాన్ని బయటపెట్టాయి. మే 6 నుంచి 9 వరకు పాకిస్థానే అమెరికాలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఇదంతా ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి 9 కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో భయపడిన పాకిస్థాన్ అమెరికా సహాయం కోరినట్లు తాజా వివరాలతో స్పష్టమైంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *