Minister Narayana Fires At Ysrcp: అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సచివాలయం, కొత్త పార్లమెంట్ ఖర్చులపై తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల నివాస భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఆరు టవర్లలో చాలా పనులు పూర్తయ్యాయని, జూన్ నుంచి వాటిని దశలవారీగా జీఏడీకి అప్పగిస్తామని తెలిపారు.
అమరావతి కోసం 30 వేలకుపైగా రైతులు 35 వేల ఎకరాల భూమి ఇచ్చారని, ఎక్కువ మంది రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. అమరావతి పనులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని, ఇలాగే మాట్లాడితే వైసీపీకి వచ్చిన 11 సీట్లు కూడా పోతాయని హెచ్చరించారు. నిర్మాణ ఖర్చుల విషయంలో హైదరాబాద్ సచివాలయం, కొత్త పార్లమెంట్‌తో పోలిస్తే అమరావతి ఐకానిక్ టవర్స్ ఖర్చులు సాధారణంగానే ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో అమరావతి ద్వారా భారీ ఆదాయం వస్తుందని కూడా మంత్రి నారాయణ అన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్