Uttam Kumar Reddy

Uttam Kumar Reddy: తెలంగాణలో వరి ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్లను జూన్ 4 లేదా 5లోపు పూర్తిగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా భరిస్తామని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ వాహనాలన్నింటిని రవాణాకు వినియోగించాలని, అవసరమైతే ప్రైవేట్ గోదాములను కూడా ఉపయోగించాలని అధికారులకు సూచించారు.

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులను తాలు, తరుగు పేరుతో మోసం చేసే మిల్లర్లు లేదా బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.16,479 కోట్ల విలువైన 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. దేశంలోనే అత్యంత పారదర్శకంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *