Women Welfare Congress Government; డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఇప్పటికే 8 వేల మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బీఆర్‌ఎస్ నేతలు కావాలనే తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ పాలనలో మహిళా సంఘాల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ తీసుకొచ్చిన వడ్డీ లేని రుణాలు, అభయహస్తం పథకాలను కూడా నిలిపివేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.66 వేల కోట్ల రుణాలు అందించామని భట్టి తెలిపారు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగినా ఎక్కడా అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో రైతులకు పగటిపూట ఉచిత సోలార్ విద్యుత్ అందించేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ పవర్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి